కేసీఆర్ కుటుంబంపై కుట్రలు
లోక్‌సభ ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ ఆరోపించారు.
- కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే…
- ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అన్యాయం
- జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్
మనోహరాబాద్, మార్చి 15 : లోక్‌సభ ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను ఖండించారు. ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకు ముందస్తు ప్రణాళికతోనే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని విమర్శించారు.
ట్రాన్సిల్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని? సుప్రీంకోర్టు ఆదేశాలను ఈడీ ఉల్లంఘిస్తుందని, ఇది పూర్తిగా చట్ట విరుద్ధమన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆదరణను ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మకై ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

