సిద్దిపేట, జూలై 20: ఏపీ జలదోపిడీ, గోదావరి నదీజలాల్లో తెలంగాణ వాటా, బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులకు వివరిస్తామని సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి రెడ్డి అన్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ నీటి హకులపై సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో ఈనెల 25 వరకు విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఆదివారం సిద్దిపేటలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంకటి నవీన్ గౌడ్, నియోజకవర్గ అధ్యక్షుడు పయ్యావుల శ్యామ్యాదవ్ మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారన్నారు. నీటి హకుల్లో రాష్ట్రాన్ని తాకట్టు పెడితే సహించమని హెచ్చరించారు. విద్యార్థుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గరిపల్లి మహిపాల్గౌడ్, బీఆర్ఎస్ చిన్నకోడూరు మండల అధ్యక్షుడు గుజ్జ రాజు, రూరల్ మండల అధ్యక్షుడు బండి శ్రీకాంత్, సమన్వయ కర్త ఇరుగంటి రమేశ్, చెట్టుపల్లి భానుచందర్, మేరుగు మాధవ్, గణగోని శ్రవణ్గౌడ్, మైలారం వంశీ, గొల్ల పల్లి రాజశేఖర్రెడ్డి, సంపంగి శ్రీకాంత్, జానకి చందు, సందీప్ పాల్గొన్నారు.