working women | మెదక్ మున్సిపాలిటీ, మార్చి 9 : మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పని చేసే ప్రదేశాలలో మహిళకు రక్షణ కల్పించాలని శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ కడారి నర్సమ్మ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన కడారి నర్సమ్మ మాట్లాడుతూ.. నేటి పాలకులకు శ్రమ చేసే మహిళలపై గౌరవం లేదని విమర్శించారు. మహిళల హక్కలు మానవ హక్కుల్లో భాగమనే విషయం మరిచి పోతున్నారని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు, హింస బాగా పెరిగి పోయిందన్నారు. మహిళలకు సమాన హక్కులు, శ్రమకు తగ్గి గుర్తింపు, సమాన పనికి సమాన వేతనం, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టించుకోవడం లేదన్నారు.
మహిళల హక్కుల సాధనకై పోరాటానికి సిద్దం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకురాళ్లు యశోద, కవిత, స్వరూప, రేణుక, వరలక్ష్మి, వీరమణి, రమాదేవి, మంజుల, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్