న్యాల్కల్, మార్చి 20: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని, తనను గెలిపిస్తే కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మామిడ్గి గ్రామ శివారులోని ఎస్ఎస్వీ రెస్టారెంట్ కన్వెషన్హాల్లో బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నూరు రవీందర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గాలి అనిల్‌కుమార్‌కు గజమాలతో ఘనస్వాగతం పలికారు. ఆయనకు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానిక్‌రావు గ్రామాల వారీగా పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలను పరిచయం చేశారు. అనంతరం గాలి అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ఎంపీగా తనను గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తూ జహీరాబాద్ అభివృద్ధికి కృషిచేస్తానని వెల్లడించారు. గ్యారెంటీ పథకాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నాయకులు, కార్యకర్తలందరూ కష్టపడి పనిచేస్తే జహీరాబాద్ నుంచి భారీ మెజార్టీని సాధించే అవకాశం ఉందన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానిక్‌రావు మాట్లాడుతూ.. గాలి అనిల్‌కుమార్ భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, మండల నాయకులు నర్సింహారెడ్డి, భాస్కర్, వీరారెడ్డి, సంగ్రాంపాటిల్, రాజ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, రాజేందర్‌రెడ్డి, పాండురంగారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, భూంరెడ్డి, శివకుమార్‌స్వామి, సత్యనారాయణ, మాణిక్‌రెడ్డి, ఎల్లారెడ్డి, సిద్ధ్దారెడ్డి, సుధాకర్‌రెడ్డి, మల్లప్ప, అప్పారావు పాటిల్, దేవదాస్, మంగలి మహేశ్, హనీఫ్, వెంకట్‌రెడ్డి, గౌసోద్దీన్, మాజీ సర్పంచులు రవి కుమార్, మహిపాల్, చంద్రన్న, మారుతీ యాదవ్, అమీర్, మల్లారెడ్డి, కుతుబొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.