– ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా
జూలూరుపాడు, మార్చి 16 : ఈ గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ఐదు నెలల నుండి వేతనలు లేక అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏఐవైఎఫ్ భద్రద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు గ్రామ పంచాయతీలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయడం ధ్రువపత్రాల జారీ ప్రభుత్వ పథకాలు దరఖాస్తులతో పాటు ఎన్నికల విధుల్లో రాత్రి పగలు తేడా లేకుండా పని చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా 83 మంది ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నట్లు చెప్పారు. సకాలంలో జీతాలు రాక కంప్యూటర్ ఆపరేటర్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు గడవని పరిస్థితిలో ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి కేవలం జీతభత్యాలతోనే జీవనం సాగిస్తున్న పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలు విడుదల చేయాలని ఆయన కోరారు.