అమరావతి : ఏపీలో చంద్రబాబు( Chandra Babu ) నాయకత్వంలో కొనసాగుతున్న దుష్టపాలనపై వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ( YCP MLC Botsa ) వెల్లడించారు. విశాఖపట్నంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్టు ( Bhogapuram Airport ) ను ముందుకు తీసుకెళ్లారని స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలోనే 2,700 ఎకరాలు భూసేకరణ చేసి భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. ఎయిర్పోర్టు ప్రారంభానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ వల్ల ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ ఓర్వలేక వైసీపీ నాయకులపై కేసులు పెడుతుందని ఆరోపించారు.
రాజకీయ జీవితంలో తాను ఎవరినీ బెదిరించలేదని, నన్ను ఎవరూ బెదిరించలేదని అన్నారు. పగలు తరువాత రాత్రి వస్తుంది. రాత్రి తరువాత పగలు వస్తుందని పేర్కొన్నారు. కాలం ఎప్పుడే ఒకేలా ఉండదని కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు తనను అడ్డుకున్నారని, ఈ విషయమై గవర్నర్కు ఫిర్యాదు చేస్తానని వివరించారు.