BRS Party | మెడికోవర్ ఆసుపత్రిలో సీఎం రేవంత్ బినామీల వాటా, అల్లుడు సత్యా గోలుగూరి మాక్స్ బియన్ ఫార్మా, ఎనుముల నిమిషా రెడ్డి మైండ్ వాల్ట్ నిర్మాణ సంస్థతో చేపడుతున్న కార్పొరేట్ స్కూల్స్ , ఇటీవలే మేడికోవర్ ఆసుపత్రిని అమ్మి దక్కించుకున్న రూ.13,200 కోట్లపై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అన్ని ఆధారాలను జతపరిచి అన్ని పార్టీల జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులకు , విచారణ సంస్థలకు బీఆర్ఎస్ లేఖ పంపించింది.
రేవంత్ రెడ్డి రూ.వేల కోట్ల బినామీ వ్యాపారాల పూర్తి వివరాలు విచారణ జరిపించాలని లేఖలో కోరింది. రేవంత్ రెడ్డి కూతురు నైమిష రెడ్డి బినామీ వ్యాపారాలపై విచారణ జరిపించాలని ఈడీ, రాష్ట్రపతి, లోక్ భవన్, ప్రధాని మోడీతో పాటు పలు విచారణ సంస్థలకు పూర్తి మెటీరియల్ సహా లేఖ రాసింది.
‘మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి’
‘కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి’