రామాయంపేట, మార్చి 9: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ని విజయవంతం చేయాలని, మౌలిక సదుపాయాలను ప్రతి పాఠశాలకు కల్పిస్తామని మెదక్ అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. బుధవారం రామాయంపేట మండలంలోని సుతారిపల్లి ప్రభుత్వ పాఠశాలతో పాటు నర్సరీని పరిశీలించారు. అనంతరం డి.ధర్మారం, ఆర్ వెంకటాపూర్, రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీ, ప్రభుత్వ బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల ద్వారా వివరాలు సేకరించారు. మన ఊరు-మన బడికి ఎంపికైన పాఠశాలల్లో సమస్యలపై నేరుగా తెలియజేయాలన్నారు. సుతారిపల్లిలో పల్లెప్రకృతి వనం, నర్సరీని చూసి బాగుందని ఎంపీడీవోకు కితాబిస్తూ, సర్పంచ్ సంధ్య, కార్యదర్శి పద్మను అభినందించారు. కార్యక్రమంలో రామాయంపేట ఎంపీడీవో యాదగిరిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, కాలేరు ప్రసాదరావు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు సాంగని యాదగిరి, సవిత, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, కార్యదర్శులు పద్మ తదితరులు ఉన్నారు.