Husband Missing | నర్సాపూర్, సెప్టెంబర్ 22 : వైన్స్ పర్మిట్ రూమ్‌లో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నర్సాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాల ప్రకారం శివంపేట్ మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి నర్సింలు (34) ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో గ్రామ బస్టాండ్ వద్దకు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు.
అదే గ్రామానికి చెందిన పోత్రపల్లి లచ్చయ్య, నర్సింలు ఇద్దరు కలిసి లచ్చయ్య బైక్‌పై నర్సాపూర్ వెళ్లారు. అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో లచ్చయ్య భార్య యాదమ్మ, నర్సింలు వాళ్ల ఇంటికి వచ్చి నా భర్త నర్సాపూర్‌లో త్రాగి పడిపోతే ఆటోలో తీసుకువచ్చామని, నువ్వు కూడా నీ భర్తను ఎక్కడ ఉన్నాడో వెళ్లి చూడమని చెప్పింది. వెంటనే నర్సింలు భార్య కుటుంబ సభ్యులతో కలిసి నర్సాపూర్ వెళ్లి తన భర్తను వెతుక్కుంటూ మెదక్ మార్గంలో గల శ్రీనివాస వైన్స్ వద్దకు వచ్చింది.
అక్కడ అతని కోసం వెతుకుతుండగా వైన్స్ లోని పర్మిట్ రూమ్‌లో నర్సింలు ఎలాంటి చలనం లేకుండా పడి ఉన్నాడు. అతన్ని వెంటనే నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దవాఖానాకు తరలించగా వైద్యులు పరిశీలించి నర్సింలు చనిపోయాడని నిర్ధారించారు. తన భర్త మరణంపై అనుమానం కలదని మృతుడి భార్య దాసరి సంధ్య పోలీస్ స్టేషషన్లో ఫిర్యాదు చేసింది. నర్సింలు మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లింగం వెల్లడించారు.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత
Tandur | ఇరువైపులా తుమ్మ చెట్లు – ప్రమాదాలకు గురువుతున్న వాహనాదారులు