Urea | మెదక్ రూరల్, ఆగస్టు 05 : రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఏడీఏ విజయ నిర్మల అన్నారు. మంగళవారం మెదక్ పీఏసీఎస్ కార్యాలయం ఎరువుల కేంద్రాన్ని ఏడీఏ విజయ నిర్మల, ఏవో శ్రీనివాస్‌తో కలిసి తనిఖీ చేశారు. ఎరువుల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె రైతులతో మాట్లాడుతూ.. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
రైతులు ఎరువులు తీసుకోవాలంటే తప్పనిసరి ఆధార్ కార్డు, ఈ పాస్ యంత్రం నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే రైతులు సిబ్బందితో సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు ప్రస్తుత వానాకాలం సీజన్ పంటల సాగు కోసం కావాల్సిన ఎరువుల నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఎరువుల విక్రయాలను ఈ-పాస్ ద్వారా జరపాలి.
ఎరువుల గోడౌన్లు, విక్రయ కేంద్రాలలో విధిగా స్టాక్ బోర్డులు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రాంతాలలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. అధిక ధరలకు యూరియాను అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సాయికుమార్, పెంటయ్య సంబంధిత సిబ్బంది ఉన్నారు.
Fraud | నేను ఎంపీ కొడుకునంటూ మోసాలు.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద దొరికిపోయాడు
రైతులకు వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్ట్ : రేగా కాంతారావు
Harish Rao | కాళేశ్వరం రిపోర్టుపై హరీశ్‌రావు పీపీటీ.. కరెంట్ కట్ చేసిన కాంగ్రెస్ సర్కార్