MLA Mynampally Rohitrao | మెదక్ రూరల్, నవంబర్ 10 : మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి 100% రాయితీతో చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మెదక్ మండలం కోంటూర్ పెద్దచెరువులో 1,84,500 చేప పిల్లలను ఎమ్మెల్యే రోహిత్ రావు సంబంధిత మత్స్య శాఖ అధికారులు, మత్స్య సహకార సంఘ సభ్యులతో కలిసి విడుదల చేశారు.
జీవనోపాధితో మెరుగైన జీవన ప్రమాణాలు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మెదక్ శాసన సభ నియోజకవర్గ పరిధిలోని (546) చెరువు లు కుంటలలో (రూ.200.88) విలువ గల (211.39) లక్షల చేప పిల్లలు సరఫరా చేయబడునని తెలిపారు. ఇందులో భాగంగా (39) పెరినియల్ చెరువులలో (63.28) లక్షల 80-100mm సైజు గల చేపపిల్లలు, (507) సిసనల్ చెరువులలో (148.10) లక్షల 35-40mm సైజు గల చేపపిల్లలు విడుదల చేయబడునన్నారు. అదేవిధంగా జిల్లాలోని (1728) చెరువులు కుంటలు, పోచారం, హల్దీవాగు ప్రాజెక్టులలో రూ.(488.75) లక్షల విలువగల (550.88) లక్షల చేపపిల్లలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. (82) పెరినియల్ చెరువులలో (132.43) లక్షల 80-100mm సైజు గల చేపపిల్లలు. (1646) సిసనల్ చెరువులలో (418.45) లక్షల 35-40mm సైజు గల చేపపిల్లలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మెదక్
జిల్లాలోని (309) మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలలో గల (16,820) సభ్యులకు జీవనోపాధి కలగడం వల్ల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. మెదక్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని (98) మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో గల (6762) సభ్యులకు జీవనోపాధి కలుగుట వలన ఎంతో సంతోషిస్తున్నామన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు తాజా చేపల మాంసం పుష్కలముగా లభిస్తుందని పేర్కొన్నారు.
జిల్లాలో వినియోగంతోపాటు ఎగుమతి చేసేందుకు సరిపడా చేపల అభివృద్ధి జరుగుతుందని, ప్రణాళిక ప్రకారం సకాలంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెదక్ సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు ఎం రామకృష్ణ, అధ్యక్షుడు ఎల్ల బోయిన ప్రశాంత్, డైరెక్టర్ జి దేవేందర్, జి అంజయ్య, మాజీ ఎంపీటీసీ ప్రభాకర్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి, బెండ రమేష్, నాగరాజ్ యాద గౌడ్, కృష్ణ ,సంబంధిత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోంటూర్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ..రూ 35వేల కోట్లు రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు, గృహ లక్ష్మి,మహాలక్ష్మి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
Collector Koya Sriharsha | ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష