ప్రజలు నమ్మిన పార్టీ బీఆర్ఎస్ అని, టికెట్లు అమ్ముకునే పార్టీ కాంగ్రెస్ అని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రాంపూర్ హనుమాన్ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నిజాంపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన మైనంపల్లి తెలంగాణ ప్రజలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. 13 ఏండ్లుగా గుర్తుకురాని మెదక్ నియోజకవర్గానికి నేడు కొడుకు కోసం వచ్చి మోసపూరిత మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. రైతుబంధు ఆపాలని ఈసీకి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా రామాయంపేట మండలం రాయిలాపూర్, కాట్రియాల, లక్ష్మాపూర్ గ్రామాల నుంచి 200మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
నిజాంపేట, అక్టోబర్ 26 : ప్రజలు నమ్మిన పార్టీ బీఆర్ఎస్ అయితే, ఎమ్మెల్యేల టికెట్లు అమ్ముకునే పార్టీ కాంగ్రెస్ అని మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రాంపూర్ హనుమాన్ ఆలయంలో స్వామివారిని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని పలు ప్రధాన వీధుల వెంబడి పర్యటిస్తూ గ్రామస్తులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు సీఎం కేసీఆర్ ప్రాణ త్యాగానికి వెనకడుగు వేయలేదని, నాడు జై తెలంగాణ అని మేమంటే మైనంపల్లి నై తెలంగాణ అని ఆనాడే తెలంగాణ ప్రజలను మోసం చేసిండని ధ్వజమెత్తారు.13 ఏండ్లుగా మెదక్ నియోజకవర్గం మైనంపల్లికి గుర్తు రాలేదని, నేడు కొడుకు కోసం మెదక్‌కు వచ్చి మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నాడని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. రైతుల సంక్షేమం కో సం విజయవంతంగా అమలవుతున్న రైతుబంధు పథకాన్ని ఆపేయాలని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేయడం హేయమైన చర్య అన్నారు.
హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు, కుమారుడు పునీత్రెడ్డికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వీధుల్లో పర్యటించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని గ్రామస్తులు అప్యాయంగా పలకరించి కారు గుర్తుకే ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మహిళలతో కాసేపు ఎమ్మెల్యే బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు,ఎన్నికల జిల్లా ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ విజయలక్ష్మి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు రాజు, సర్పంచులు కవిత, బాల్‌నర్సవ్వ,అమరసేనారెడ్డి, అరుణ్‌కుమార్,గేమ్‌సింగ్,ఎంపీటీసీలు బాల్‌రెడ్డి,సురేశ్, మండల కో-ఆఫ్షన్ సభ్యుడు గౌస్, కల్వకుంట, నిజాంపేట పీఏసీఎస్ చైర్మన్లు అందె కొండల్‌రెడ్డి, బాపురెడ్డి, సోషల్ మీడియా మండలాధ్యక్షుడు అబ్దుల్అజీజ్, మాజీ ఎంపీపీ సంపత్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగుస్వామి, రాంపూర్ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు యాదగిరి, నాయకులు ఉన్నారు.