Grains on Roads | రామాయంపేట, ఏప్రిల్ 15 : రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజగౌడ్ అన్నారు. ఇవాళ తన కార్యాలయంలో సీఐ విలేకరులతో మాట్లాడుతూ.. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడంతో విలువైన ప్రాణాలకు కారణం రైతులే అవుతారని పేర్కొన్నారు.
ఇకపై ధాన్యం రోడ్లపై కనిపిస్తే ధాన్యాన్ని నేరుగా పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తామన్నారు. ధాన్యం ఆరబోసిన వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
ధాన్యం ఆరబోయడం వల్ల వాహనాలు పల్టీ కొట్టడంతో బైకర్లు, ఇతర వాహనదారులు మృతి చెందడం జరుగుతుందని అన్నారు. రైతులు అందుకోసం ధాన్యం ఆరబోయడం ఇకనైనా మానుకోవాలన్నారు.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ సేన రెడీ.. శ్రేణులకు ఎమ్మెల్యే మాణిక్‌రావు దిశానిర్దేశం
MLC Kavitha | బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Rajapet : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధన : ఎంఈఓ చందా రమేశ్