చిన్నకోడూరు, ఏప్రిల్ 5: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి నీటి పం పింగ్ ప్రారంభం కావడం తో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కృషి ఫలించింది. యాసంగి సాగు పూర్తయ్య వరకు రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయాలని ఇటీవల హరీష్ రావు అసెంబ్లీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి లేఖ అందజేశారు.
మంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే నీటిని రిజర్వాయర్‌లోకి విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం రిజర్వాయర్‌లోకి నీటి విడుదల ప్రారంభమైంది. దీంతో తమ పంటలు గట్టెక్కుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.