Indiramma Houses | నర్సాపూర్, నవంబర్ 06 : ఇంకా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టని వారికి వారం రోజులు గడువు ఇస్తున్నామని, వారం రోజుల తర్వాత కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టని యెడల లబ్దిదారుల స్థానంలో వేరే లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించే విధంగా చూడాలని ఇందిరమ్మ ఇండ్ల కార్యదర్శి వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు.
గురువారం నర్సాపూర్ మండల పరిధిలోని పెద్దచింతకుంట గ్రామంతోపాటు కొల్చారం, కౌడిపల్లి మండలాలలో గల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో రాష్ట్ర ఇందిరమ్మ ఇండ్ల కార్యదర్శి వీపీ గౌతమ్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో లబ్దిదారులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేస్త్రీలు ఎక్కువ ఇండ్లు కాంట్రాక్ట్ తీసుకోవడం మూలంగా పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా లబ్దిదారులు వెల్లడించారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యదర్శి వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన మార్క్ అవుట్ పనులు వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు, గృహనిర్మాణ శాఖ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
మార్క్ అవుట్ పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం వహించిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. లబ్దిదారులు ఇండ్లు నిర్మించుకునే సమయంలో ఇబ్బందులు తలెత్తితే నిర్మాణానికి అవసరమైన నిధులను మహిళ సంఘాల (స్వయం సహాయక సంఘాలు) ద్వారా లోన్ రూపంలో లబ్దిదారులకు అందించాలని, లబ్దిదారులు ఇండ్లు సమయానికి పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుందని వెల్లడించారు.
జీపీ, వార్డుల వారిగా సమావేశాలు నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులలో పురోగతిని తీసుకురావాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, హౌసింగ్ పీడీ మాణిక్యం, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Crime news | భార్యపై అనుమానంతో ముక్కు కోసేసిన భర్త..!
Chevella | చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా.. 25 మందిపై కేసు నమోదు
Home Minister Anitha | ఏపీని గంజాయిని రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్ ది: హోంమంత్రి అనిత