Venkateshwara Temple Brahmotsavalu | మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 12 : జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర దేవాలయ 35వ బ్రహోత్సవాల ఆహ్వాన పత్రికను శనివారం దేవాలయ కమిటీ అధ్యక్షుడు కంచి మధుసూదన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
మే 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు బ్రహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని మధుసూదన్ తెలిపారు. ఇందులో భాగంగా 3వ తేదీన శ్రీనివాస పద్మావతి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రావు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనివాస్, కళ్యాణి, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు నాగరాజు, వెంకన్న తదితర భక్తులు పాల్గొన్నారు.
Ramakrishna Math | రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలు
padi koushik reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
Mutton | మటన్‌ను ఎంత మోతాదులో తింటే మంచిది..? ఈ లిమిట్ దాటితే కష్టమే..!