చేర్యాల,సెప్టెంబర్15: దేవుళ్ల భూములకు రక్షణ లేకుం డా పోతున్నది. దేవుడికి విరాళంగా ఇచ్చిన భూ ములు, దేవుడి పేరిట నమోదైన భూములను కొందరు రెవెన్యూ అధికారులు విరాళమిచ్చిన వారుసులకు పట్టా చేసి దేవుడికి అన్యాయం చేస్తున్నారు. విరాళం ఇచ్చిన భూమి దేవుడి పేరిట ఉండాలని కొన్నేండ్లుగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శభాష్‌గూడెం ప్రజలు పోరాడుతున్నారు.
దేవుడి భూమిని కాపాడేందుకు పొరుగూరు నాగపురి గ్రామస్తులతో కలిసి ఐక్యంగా పోరాడుతున్నారు. చేర్యా ల మండలం శభాష్‌గూడెం గ్రామంలో కొలువైన వీరభద్ర స్వామి భూమి ఆన్యాక్రాంతం చేసేందుకు కొం దరు యత్నిస్తున్నారు.దేవుడి పేరిట భూమి నమోదైందనే విషయాన్ని పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు తమ హస్తవాసి చూపించడంతో దేవుని భూమికి ఎసరొచ్చింది.
విరాళంగా ఇచ్చిన భూమిని రెవె న్యూ రికార్డులను తమకు అనుకూలంగా మార్చుకున్న దాత కూతురు మొదటగా తప పేరిట పట్టా చేయించుకున్నారు. అనంతరం ఆమె వారసుడు మరోసారి పట్టా చేయించుకున్నారు. ఇటీవల దేవాలయ భూమిని కొలతలు వేయించేందుకు వారసులు యత్నిస్తుంచడంతో వెంటనే నిలిపివేయాలని, దేవుడి భూమిని రక్షించాలని చేర్యాల తహీసీల్ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళన దిగారు.అనంతరం దేవుడి భూమి కాపాడలని రెవె న్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
నాగపురి గ్రామ రెవెన్యూ పరిధిలోని శభాష్‌గూడెంలో 705 సర్వేనంబర్‌లో వీరభద్ర స్వామి ఆలయం ఉంది. ఆలయానికి ఎలాంటి ఆదాయ వనరులు లేకపోవడంతో గ్రామానికి చెందిన ఉప్పల రామచంద్రయ్య సర్వే నెం 705లో 7.30 ఎకరాల భూమిని దేవుడి పేరి ట పట్టా చేసుకోవాలని 28 జూన్ 1981న ఆలయానికి విరాళంగా సాదాబైనామా రాసి ఇచ్చాడు.
ఇదే సర్వేనంబర్‌లో మిగిలిన మూడెకరాల భూమిని దళితుల ఇండ్ల స్థలాల కోసం అందజేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. సదరు భూములపై తమ వారసులకు ఎలాంటి హక్కులు ఉండవని విరాళంగా ఇచ్చిన పత్రంలో దాత ఉప్పల రామచంద్రయ్యా రాయించి గ్రామస్తులకు అం దజేశారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం 1981 నుంచి 2012 వరకు పట్టాదారుడిగా ఉప్పల రామచంద్రయ్య పేరు రాగా, కాస్తుకాలంలో మాత్రం ఆలయ భూములుగా వచ్చింది.పెరిగిన భూ ధరల కారణంగా రామచంద్రయ్య వారసులు భూమిని దక్కించుకునేందుకు యత్నిస్తుండడంతో తరుచూ గ్రామంలో ఆందోళనలు నెలకొంటున్నాయి.
ఉప్పల రామచంద్రయ్య గ్రామానికి భూమిని రాసిచ్చినప్పటి నుంచి రెవెన్యూ రికార్డుల్లో వీరభద్ర స్వామి ఆల యం పేరిట ఉంది.2007లో సదరు భూమి దేవాదాయశాలో నమోదైంది. కానీ, 2013లో ఉప్పల రామచంద్రయ్య కూతురు ఎలిషాల లక్ష్మి పేరిట పట్టా మార్పి డి జరిగింది. గతంలో శభాష్‌గూడెం నాగపురి పంచాయతీ పరిధిలో ఉండడం అప్పుడు పెద్దగా భూముల ధరలకు డిమాండ్ లేకపోవడంతో పట్టామార్పిడి విష యం బయటకు పొక్కలేదు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం కొత్త జిల్లాలు, పంచాయతీలు లేర్పాటు కావడంతో నాగపురి నుంచి విడిపోయి శభాష్‌గూడెం గ్రామ పంచాయతీగా అవతరించింది.ఈ క్రమంలో గ్రామ అభివృద్ధి కోసం నాడు ప్రతి గ్రామంలో నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవాలని నాటి సర్కారు ఆదేశాలు జారీచేసింది. గ్రామంలో భూమి లేకపోవడంతో నర్సరీ తదితర నిర్మాణాలను ఇదే భూముల్లో గ్రామస్తులు ప్రారంభించారు.
తన పేరిట పట్టాగా ఉన్న భూమిలో నిర్మాణాలు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకున్న ఎలిశాల లక్ష్మి కోర్టును ఆశ్రయించింది. దీంతో సదరు భూమిలో నిర్మాణాలు నిలిచిపోయాయి.డిసెంబర్ 2023లో ఇదే భూమిని లక్ష్మి ఎలిశాల ఆనంద్ పేరిట పట్టా చేయడంతో గ్రామస్తులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.వివాదం కొనసాగుతున్న భూమి విషయంలో నాటి రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుని పట్టా మార్పిడి చేశారని ఆరోపణలు వచ్చాయి.
శభాష్గూడెంలోని వీరభద్ర స్వామి ఆలయం దేవాదా య రికార్డుల్లో నమోదై ఉంది. ఉప్పల రామచంద్రయ్య దానం ఇచ్చిన 7.30గుంటల భూమి దేవాదాయ శాఖ 43 రిజిస్టర్లో నమోదు చేశారు. దేవుడి భూమి పట్టా మార్పిడి జరిగిందనే విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు దేవాదాయ శాఖ అధికారులకు తెలియజేయడంతో వెంటనే పట్టాదారు పాసు బుక్కులు రద్దు చేయాలని తహసీల్ కార్యాలయానికి లేఖను సైతం పంపించారు. కానీ, రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దేవాదాయ, రెవెన్యూ శాఖ అధికారులు శ్రద్ధ వహించి ఆలయ భూములను కాపాడాలని శభాష్గూ డెం, నాగపురి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
గ్రామంలోని దేవాలయ భూమిని కాపాడేందుకు శభాష్‌గూడెం గ్రామస్తులు కొన్నేండ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రభుత్వ భూములు, ఆలయ భూములు నిషేధిత జాబితాలో పొందుపర్చినప్పటికీ, వీరభద్ర స్వామి ఆలయ భూములను రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ధరణి పోర్టల్‌లో ఆ భూమి నమోదు కాలేదు.దీంతో అధికారులు డబ్బులు తీసుకుని పట్టామార్పిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
దేవుడి పేరిట విరాళం ఇచ్చిన భూమిని పట్టా చేశారని, వాటిని రద్దుచేసి వీరభద్రుని పేరిట పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని గ్రామస్తులు ఇప్పటి మూడుసార్లు తహసీల్ కార్యాలయం వద్ద ఆందోళన చపట్టారు. భూ మిని కాపాడేందుకు కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ సైతం తీసుకువచ్చారు. కానీ, పట్టాదారులమంటూ ఎలిశాల ఆనంద్ భూములు కొలతలు వేసే జిల్లాస్థా యి అధికారిని తీసుకువచ్చేందుకు యత్నించగా, గ్రామస్తులు తహసీల్ కార్యాలయం వద్ద మరోసారి ఆందోళన చేపట్టారు. సర్వే నిర్వహించవద్దని, పట్టా రద్దు చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
వీరభద్ర స్వామి ఆలయ భూములను కాపాడాలని గ్రామస్తులు ఇటీవల వినతిపత్రం అందజేశారు.శభాష్‌గూడెం, నాగపురి గ్రామస్తుల వినతి మేరకు విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం.ఇప్పటికే రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ తదితరులతో వీరభద్ర స్వామి ఆలయం భూసమస్యను తేల్చాలని ఆదేశాలు జారీచేశాను.విచారణ అనంతరం ఆలయ భూముల విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం.
-సమీర్ హైమద్‌ఖాన్, తహసీల్దార్ చేర్యాల (సిద్దిపేట జిల్లా)