తూప్రాన్, అక్టోబర్ 20: రైతు భరోసా ఎగ్గొడితే సహించమని, రైతుభరోసా ఇచ్చే వరకు ప్రభుత్వం పై పోరాడుతామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆదివారం తూప్రాన్‌లో బీఆర్ఎస్ శ్రేణులతో కలసి తహసీల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వర కు ర్యాలీ తీశారు.
బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఉండే 67 లక్షల మం ది రైతులకు, కోటి యాభై లక్షల ఎకరాలకు ప్రతి పంటకూ నాట్లకంటే ముందే రెండు పంటలకు రూ.7600 కోట్ల చొప్పున రూ.15 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశారన్నారు. అనేక పథకా లు, సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ అమలు చేశారన్నారు. రైతులకు చేయూతనిచ్చినట్లు గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నదని, హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నదని వం టేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. ఆందోళనలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సతీశ్‌చారి, మండల ప్రధా న కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీటీసీ సంతోష్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ గౌడ్, మాచిరెడ్డి కృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, మన్నె శ్రీనివాస్, షేక్ బురాన్, జిన్న రాజు, యాసిన్, చింతల దశరథ, రమేశ్, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.