గజ్వేల్, నవంబర్ 22: నదులు, ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజరవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం గజ్వేల్‌లోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..కొండపాచమ్మ సాగర్‌ను కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం కోసం నిర్మాణం చేసిండని రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి మాట్లాడడం ప్రాజెక్టులపై వారికి ఏమాత్రం అవగాహన లేదనే విషయం ప్రజలకు అర్థమవుతుందన్నారు. ప్రజలు విజ్ఞులని, వారికి అన్ని విషయాలు తెలుసన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా హామీల అమలులో విఫలం కావడంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు. కొండపోచమ్మ సాగర్ నిర్మాణంతో కూడవెళ్లి వాగు మీదుగా సాగునీరు అప్పర్ మానేరుకు చేరుతుందని, సంగారెడ్డి కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీ, నిజాంసాగర్‌కు గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించినట్లు తెలిపారు. తుర్కపల్లి కాలువ ద్వారా భువనగిరి, ఆలేరుకు నీటిని అందిస్తున్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై తిట్ల పురాణం తప్పా ప్రజలకు రేవం త్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. భద్రత లేకుం డా ప్రజల్లోకి వస్తే రేవంత్‌రెడ్డికి తెలుస్త్తదని, ఇప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్‌కు ఒక్కసీటు రాదన్నారు. తెలంగాణలో ప్రజల బతుకులు ఆగమయ్యాయని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు, రుణమాఫీ చేయడంలో, 42గంటల కరెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అయిందన్నారు. హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను స్వీకరించి కబ్జాలను చూపించాలని, నోటికొచ్చినట్లు ఏదిపడితే అది మాట్లాడటం తగదన్నారు.
దమ్ముం టే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లో చేర్పించుకున్న 11మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలువాలని, వారు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల కోసం కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులను నిర్మించారని, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును కాళేశ్వరం నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 50 ఏండ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్ తెలంగాణకు ఏమి చేసిందో చెప్పాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, మండల, పట్టణ అధ్యక్షులు బెండే మధు, నవాజ్‌మీరా, కౌన్సిలర్ అల్వాల బాలేశ్, మెట్టయ్య, మ ద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, కాసీం, నర్సింగరావు, రవీందర్, ఉమార్, ఆర్కే శ్రీనివాస్, దుర్గాప్రసాద్, శ్రీధర్, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, కల్యాణ్కర్ శ్రీనివాస్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.