గజ్వేల్, అక్టోబర్ 6: గజ్వేల్‌లో కాం గ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయా లు మానుకోవాలని, కేసీఆర్ గురించి మాట్లాడే నైతికహక్కు ఆ పార్టీ నాయకులకు లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శంచారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ముంటే కేసీఆర్ మంజూరు చేసిన రూ.170కోట్లను వెన క్కి తీసుకొచ్చి గజ్వేల్ అభివృద్ధ్దికి తోడ్పడాలన్నారు.
నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. గజ్వేల్ కాంగ్రెస్‌లో గ్రూపులు ఉన్నాయని, నామినేటెడ్ పదవుల కోసం పాకులాడుతూ మతిభ్రమిం చి మాట్లాడుతున్నారని విమర్శించారు. దమ్ము, ధైర్యం ఉంటే కేసీఆర్ చేసిన అభివృద్ధిలో గజ్వేల్‌లో ఒకశాతం అభివృద్ధి చేయించాలని డిమాండ్ చేశారు. పేదలు, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడక ముందు గజ్వేల్ నియోజకవర్గం ఎట్లుం డే, కేసీఆర్ పాలనలో ఎట్లా మారిందని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు.
అనే క హామీలిచ్చి అందరినీ మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మల్లేశం, వైస్ చైర్మన్ జకియోద్దిన్, మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, నాయకులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, అహ్మద్ ఉన్నారు.