గజ్వేల్, మార్చి 14: ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో నిలదీస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ చేయడం అప్రజాస్వామికమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభు త్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం పై జగదీశ్‌రెడ్డి కాంగ్రెస్ వైఫల్యాలను అసెంబ్లీలో నిలదీస్తుంటే జీర్ణించుకోలేకనే సస్పెండ్ చేశారని, నిండుసభ సాక్షిగా కాంగ్రెస్ వైఫల్యాలపై మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతామనే భయంతోనే ఇలాంటి చర్యలను ప్రభు త్వం పూనుకున్నట్లు విమర్శించారు. ఇలాంటి చర్య ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు.
ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించిందన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించని ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పుతారని పేర్కొన్నారు. జగదీశ్‌రెడ్డి ఏం తప్పు చేశారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో సాగునీళ్లు లేక రైతు ల పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ఇలాంటి చిల్లర పనులకు ప్రభుత్వం పాల్పడుతున్నట్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెనుకబడిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రోజుకో ఆత్మహత్య చోటుచేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదని వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, మాజీ జడ్పీటీసీ మల్లేశం, మాజీ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండె మధు, నవాజ్‌మీరా, మాజీ కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, గుంటుక రాజు, గొడుగు స్వామి, అహ్మద్, రవీందర్, కనకయ్య, శ్రీధర్, అంజనేయులు, కల్యాణ్కర్ శ్రీను, దయానందరెడ్డి, కరీం, బీరయ్య, లతీఫ్, నరేష్ పాల్గొన్నారు.