Vanteru Pratap Reddy | గజ్వేల్, మార్చి 31: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు రంజాన్ పండగలు వస్తే గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రంజాన్ తోఫాను ఇవ్వకుండా అన్యాయం చేసిందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఇవాళ రంజాన్ పండుగ సందర్భంగా గజ్వేల్, ప్రజ్ఞాఫూర్, సంగాపూర్లలో ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తే ఈ ప్రభుత్వం అందరిని విస్మరించిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల తరువాత నెలవంక కనిపించిన మరుసటి రోజున రంజాన్‌ను జరుపుకోవడం జరుగుతుందని.. ఉపవాస దీక్షలతో ఆరోగ్యంగా ఉంటారన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
AP News | వారం రోజుల నుంచి గుడి ముందు నగ్నంగా పూజలు.. ఉగాది రోజు సజీవ సమాధికి యత్నం!
Jagadish Reddy | ఆ భాషే ఆయన్ను బొందపెడుతుంది.. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ధ్వజం