కాలుష్యకారక పరిశ్రమను తరలించాలి
కాలుష్య కారక ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను ఇక్కడి మూసివేసి, ఇతర ప్రాంతాలకు తరలించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలోని ఎంఎస్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను స్థానికులతో కలిసి ఆయన పరిశీలించారు.
- బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి
మనోహరాబాద్, జూలై 18 : కాలుష్య కారక ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను ఇక్కడి మూసివేసి, ఇతర ప్రాంతాలకు తరలించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలోని ఎంఎస్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను స్థానికులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమతో రంగాయిపల్లి, చెట్లగౌరారం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
ఉన్న పరిశ్రమనే తీసి వేయాలని ప్రజలు పోరాటం చేస్తుం టే, ప్రస్తుతం దానిని ఇంకా విస్తరించాలని చూస్తుండడం తగదన్నారు. పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్య వ్యర్థాలు స్థానిక చింతకుంటలో కలుస్తున్నాయని ఆరోపించారు. పరిశ్రమ చుట్టూ ఎక్కడ బోర్లు వేసినా వ్యర్థ జలాలే వస్తున్నాయని, దీంతో రైతులు పంటలు పండించుకోలేని పరిస్థితి ఉందని వంటేరు అన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, సర్పంచ్‌లు మోతిబాయిలక్ష్మణ్సింగ్, సాయికుమార్, మాజీ సర్పంచ్‌లు పూల అర్జున్, నాగభూషణం, నాయకులు కూచారం నరేశ్, సాయి పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

