మాటలు చాలించి నిర్వాసితులను ఆదుకోవాలి
సీఎం రేవంత్‌రెడ్డి మొదలుకొని కాంగ్రెస్ నాయకులంతా మాటలు చాలించి ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ముంపు గ్రామాల నిర్వాసితులు 400మందికి రావాల్సిన రూ.448కోట్లను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్చార్జి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గజ్వేల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
- ప్రభుత్వం రూ.448కోట్లు విడుదల చేయాలి
- హామీలను అమలు చేసి కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధిని చాటుకోవాలి
- గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, అక్టోబర్ 18: సీఎం రేవంత్‌రెడ్డి మొదలుకొని కాంగ్రెస్ నాయకులంతా మాటలు చాలించి ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ముంపు గ్రామాల నిర్వాసితులు 400మందికి రావాల్సిన రూ.448కోట్లను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్చార్జి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గజ్వేల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో ముంపు గ్రామాలకు చెందిన 9600మంది బాధితులకు డబుల్ బెడ్రూం ఇం డ్లు, ఓపెన్ ప్లాట్లు, ప్యాకేజీలు అందజేశామన్నారు. మైకుల ముందు మాట్లాడి ప్రజలను అయోమయానికి గురిచేసి అబద్ధాలు మాట్లాడడం కాంగ్రెసోళ్లకు అలవాటైందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చేయతనిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అప్పుల ఉబిలోకి నెడుతోందని విమర్శించారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నిర్మించి కేసీఆర్ సాగు,తాగునీటి కష్టాలు తీర్చారన్నారు.
హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మూసీ సుందరీకరణ పేరు చెప్పి పెద్ద స్కామ్‌కు కాంగ్రెస్ సర్కారు తెరలేపిందని ఆయన. కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడి ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రైతులకు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, చేతకాని పక్షంలో సీఎం పదవికి రాజీనామా చేయాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. దమ్ముంటే మాజీమంత్రి హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరించి మల్లన్నసాగర్, కొండపోచమ్మ ముంపు గ్రామాల్లో పర్యటిస్తే వెయ్యి మందితో స్వాగతం పలుకుతామని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

