మెదక్, జూలై 27(నమస్తే తెలంగాణ): అన్నివర్గాల సంక్షేమమే మోదీ ప్రభుత్వ ధ్యేయమని, ఎన్డీయే ప్రభుత్వానికి దేశమంతా సమానమేనని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రామదాస్ అథావలే అన్నారు. శనివారం మెదక్‌లోని బీజేపీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దేశంలోని 85శాతం మంది పేదల కోసం మోదీ సరార్ పని చేస్తున్నదని తెలిపారు. ఉజ్వల యోజన పథకం ద్వారా ఇం టింటికీ గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. ఇంటింటికీ మూత్రశాలలు, మరుగుదొడ్లు కట్టించామని గుర్తు చేశారు.
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఒకో కుటుంబం రూ.5లక్షల వైద్యం అందుతోందని తెలిపా రు. ఏపీకి రాజధాని లేకపోవడంతో ఎకువ నిధులు కేటాయించామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లకు ఎప్పటికీ కేంద్ర బడ్జెట్ అర్థంకాదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేంద్రం నుంచి రెండు పథకాల కిందే రూ.50వేల కోట్లు వస్తున్నట్టు తెలంగాణ బడ్జెట్ కాపీలోని 4వ పేజీలో ఉందని, ఈ విషయాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు తప్ప మరే నియోజకవర్గానికి నిధులు ఎందుకు ఇవ్వలేదని ఎంపీ ప్రశ్నించారు.