నారాయణఖేడ్, డిసెంబర్ 26: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధ రాత్రి నారాయణఖేడ్ పోలీస్స్టేషన్ పరిధిలోని 161 జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దశంకరంపేట మండలం జూకల్ గ్రామానికి చెందిన జీవయ్య (41), టేక్మాల్ మండలం ఎల్లుపేట్కు చెందిన కమ్మరి నాగభూషణం (40) ఆదివారం అర్ధరాత్రి బైక్పై నిజాంపేట్ వైపు నుంచి పెద్దశంకరంపేట వైపు నిజాంపేట్ శివారులోని 161 జాతీయ రహదారిపై వెళ్తున్నారు.
వీరు ప్ర యాణిస్తున్న బైక్ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరి యా దవాఖానకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.