Bike Accident | పాపన్నపేట, జులై 30 : పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి శివారులో బుధవారం సాయంత్రం రెండు బైకులు ఎదురురెదురుగా వచ్చి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. అతన్ని వెంటనే 108 వాహనంలో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పాపన్నపేట పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. మల్లంపేటకు చెందిన వుట్టి నాగరాజు నార్సింగిలో చేపలు అమ్ముకొని బైక్పై పాపన్నపేటకు వస్తున్నాడు. శంకరంపేట మండలం దానంపల్లికి చెందిన నర్ర సాయిబాబ మెదక్ నుండి స్వగ్రామానికి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో నార్సింగి శివారులో దారిదేవుని ఆలయ సమీపంలో ఇద్దరు వెళ్తున్న రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మల్లంపేటకు చెందిన వుట్టి నాగరాజు తలకు గాయాలు కాగా.. అతని పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుండగా.. మరోవైపు సాయిబాబ కాలు విరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Madhira : బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ : చిత్తారు నాగేశ్వర్రావు