సిద్దిపేట, మే 1: రెగ్యులర్ చేసినందుకు కాంట్రాక్టు లెక్చరర్లు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావును కానియాడారు. సోమవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావును కాంట్రాక్టు లెక్చరర్లు కలిసి పూలబొకే అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ గజమాల, శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. మంత్రి హరీశ్‌రావు పలువురికి మిఠాయిలు తినిపించారు.