కొమురవెల్లి, మార్చి 20: రేపు కొమురవెల్లికి ఎమ్మెల్సీ కవిత రానున్నట్లు బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు గోపు సదానందం తెలిపారు. గురువారం కొమురవెల్లిలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందిన సందర్భంగా భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత శనివారం కొమురవెల్లికి చేరుకొని మల్లికార్జునస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలిపారు.
కవితకు ఆహ్వానం పలికేందుకు బీసీ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మహిళలు భారీగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిషన్, కిష్టయ్య, నర్సింహులు, మాజీ ఉపసర్పంచ్ శ్రీధర్, కనక మల్లేశం, సురేశ్, మల్లేశం పాల్గొన్నారు.