పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా న టించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. హరీశ్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పోలీస్ యాక్షన్ డ్రామా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. పవర్ఫుల్ యాక్షన్, పంచ్ డైలాగ్‌లు, చక్కటి వినోదంతో ట్రైలర్ ఆసాంతం ఆకట్టుకుంది. పవన్‌కల్యాణ్ తన ట్రేడ్ మార్క్ మేనరిజం, డైలాగ్స్‌తో అదరగొట్టాడు.
‘సంతోషంగా ఉండటం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం.. మన జీవితానికి ఎవడెవడో లైక్‌లు కొట్టడం కాదు’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్…ఇచ్చిపడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం’, ‘ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది..’ అంటూ పవన్‌కల్యాణ్ చెప్పిన సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి. మాస్, కమర్షియల్ అంశాలను పర్ఫెక్ట్గా కలబోసి దర్శకుడు ఈ సినిమాను రూపొందించారని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతున్నది. శ్రీలీల, రాశీఖన్నా, పార్థిబన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, నేపథ్య సంగీతం: తమన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రచన-దర్శకత్వం: హరీశ్‌శంకర్ ఎస్.