మెదక్ మున్సిపాలిటీ, జనవరి 11: మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టు రైతులకు యాసంగి సాగుకు నీరు విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం 11 గంటల నుంచి సాయంత్రం వరకు మెదక్ కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్లు మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, బీఆర్ఎస్ మెదక్ పట్టణ కన్వీనర్ ఆంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మహాధర్నాకు బీఆర్ఎస్ మెదక్ జిల్లా ఆధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గం ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తదితర నాయకులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట, మెదక్, హావేళిఘనపూర్ మండలాల రైతులు, నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం మండల రైతులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై మహాధర్నాను విజయవంతం చేయాలని వారు కోరారు.