అమీన్పూర్, జూలై 5: పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల్లో మరో ముగ్గురు ఆచూకీ డీఎన్ఏ పరీక్షల ద్వారా అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన నాటినుంచి ఆచూకీ తెలియక శవాలను పటాన్చెరు ఏరియా దవాఖానలోని ఫ్రీజర్లో భద్రపరిచారు. శుక్రవారం నాటికి డీఎన్ఏ పరీక్షల కోసం పంపిన వాటిలో ఐదు మృతదేహాలు మిగిలి ఉన్నాయి.
శనివారం ఉదయం మరో ముగ్గురి డీఎన్ఏ పరీక్షలు ఫలితాలు రావడంతో వారి కుటుంబీకులకు మృతదేహాలను అప్పగించి, వారి స్వస్థలాలకు పంపించారు. వీరితో పాటే సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గాయపడ్డ మున్మున్ చౌదరి ధ్రువ దవాఖానలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. దీంతో మున్మున్ చౌదరి మృతదేహాల ఆచూకీ తెలియాల్సి ఉంది.అందుకు వైద్యులు ఫ్రీజర్లో ఉన్న మృతదేహాల కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాటి పరీక్షల అనంతరం వారి కుటుంబాలకు అప్పగిస్తారు.