Medak : మెదక్ పట్టణంలోని కొందరు ఘరానా మోసగాళ్లు నకిలీ బంగారంతో బ్యాంకుకే టోకరా వేశారు. స్థానిక ఆదర్శ కోపరేటివ్ బ్యాంకులో నకిలీ బంగారం కుదవపెట్టి భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఆదర్శ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ అనిల్‌తో పాటు బంగారం తనిఖీ చేసే శ్రీనివాస్ చారిని ప్రధాన సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. నకిలీ బంగారం కుదవ పెట్టి బ్యాంకులో రూ. 179.54 లక్షలు లోన్ తీసుకున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆదర్శ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో నిందుతులు ముగ్గురు స్నేహితుల ఆధార్ కార్డు పాన్ కార్డులు తీసుకొని నకిలీ బంగారం పెట్టి లోను తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తుండగా.. వీరు రూ. 31.35 లక్షలు డిపాజిట్ చేయకుండా తీసుకున్నట్టు గుర్తించారు. నకిలీ బంగారం కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న బ్యాంకు మేనేజర్ అనిల్ పరారీలో ఉన్నట్టు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు.