హైదరాబాద్, ఆగస్టు12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ ట్యాంక్‌బండ్ హెచ్ఎండీఏ గ్రౌండ్ పక్కన ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా, సావిత్రీబాయి ఫూలే దంపతుల విగ్రహాన్ని 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఆవిషరణ ఏర్పాట్లపై మంత్రి పొన్నం బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విగ్రహాల ఆవిషరణ, హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నామని వెల్లడించారు.