చీలపల్లిలో దొంగల బీభత్సం
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చీలపల్లిలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని పలు ఇండ్లలో చొరబడి భారీగా చోరీకి పాల్పడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. చీలపల్లికి చెందిన రాయిని రాములు ఇంటికి తాళం వేసి కామారెడ్డి జిల్లా బాన్సువాడకు వెళ్లారు. శుక్రవారం ఉదయం పనిమనిషి ఇంటికి వెళ్లగా, తాళాలు పగులగొట్టి ఉండటం చూసి వెంటనే రాయిని రాములుకు సమాచారం అందించడంతో హుటాహుటినా ఇంటికి చేరుకున్నారు.
- 113 తులాల బంగారం, 2.50 కిలోల వెండి చోరీ
- నిందితులను పట్టుకుంటాం: మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు
పెద్దశంకరంపేట, మే 15: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చీలపల్లిలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని పలు ఇండ్లలో చొరబడి భారీగా చోరీకి పాల్పడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. చీలపల్లికి చెందిన రాయిని రాములు ఇంటికి తాళం వేసి కామారెడ్డి జిల్లా బాన్సువాడకు వెళ్లారు. శుక్రవారం ఉదయం పనిమనిషి ఇంటికి వెళ్లగా, తాళాలు పగులగొట్టి ఉండటం చూసి వెంటనే రాయిని రాములుకు సమాచారం అందించడంతో హుటాహుటినా ఇంటికి చేరుకున్నారు.
ఇంటికి వెళ్లి చూడగా, బీరువాలు పగులగొట్టి 110 తులాల బంగారం, 2.50 కిలోల వెండి దొంగిలించ బడిందని గుర్తించారు. సమీపంలో ఉన్న మరో ఇంట్లో సైతం మూడు తులాల బంగారం దొంగలించినట్లు బాధితుడు ఏసిరెడ్డి మానిక్‌రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, క్రైం సీఐ రాజశేఖర్, అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం ఎస్ఐలు ప్రవీణ్‌రెడ్డి, శంకర్ శుక్రవారం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
రాయిని రాములు ఇంట్లో మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఇంటి పరిసర ప్రాంతాలు, పగలగొట్టిన బీరువాను పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్‌స్కాడ్ చీలపల్లికి చేరుకొని దొంగతనం జరిగిన ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ దొంగలను పట్టుకుంటామని తెలిపారు. సీసీ కెమెరాలు ఫుటేజీలను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు శుభకార్యాలు, ఇతర పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు ఉంచుకోరాదని ఎస్పీ సూచించారు. చోరీపై బాధితులు పెద్దశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్‌లు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

