సిద్దిపేట, జూన్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. పంట పెట్టుబడి కోసం ఏటా రెండు దఫాలుగా ఆర్థిక సాయం అందజేస్తూ అండగా నిలబడుతున్నది. ఈ ఏడాది వానకాలం సీజన్ కోసం సోమవారం నుంచి రైతుబంధు డబ్బులు అన్నదాతల అకౌంట్లలో జమచేయనున్నది.
మెదక్ జిల్లాలో 2,74,815, సంగారెడ్డి జిల్లాలో 4,04,438 మందికి ఆర్థికసాయం అందనున్నది. గతేడాది కంటే ఈ సారి ముందుగానే నగదు అందుతుండడంతో రైతు కుటుంబాల్లో అనందం వెల్లివిరుస్తున్నది.