సంగారెడ్డి, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అడుగడుగునా ఆసరాగా నిలుస్తున్న ది. రైతుల కోసం అనేక పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఉచిత కరెంటుతోపాటు సాగునీరు ఇస్తూ రైతుబంధుతో ద్వారా పంట సాగుకు ఆర్థికసాయం, రైతుబీమా పథకాలను అమలు చేస్తూ బీఆర్ ఎస్ ప్రభుత్వం అండగా ఉంటున్నది. వర్షాలకు పంటనష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ బాసటగా నిలుస్తున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలంగాణలో పంటనష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల పరిహారం సీఎం కేసీఆర్ అందజేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలకు పెద్ద ఎత్తున పంటలు దెబ్బ తిన్నాయి. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు కలెక్టర్ శరత్, వ్యవసాయాధికారులను అప్రమత్తం చేసి వర్షాలతో ఎక్కువగా నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు.
పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదే శించారు. మంత్రి సూచనలతో వ్యవసాయశాఖ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి పంటనష్టం వివరాలను సేకరించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి జిల్లాలో పంటనష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించారు. పరిహారం డబ్బులను శుక్రవారం మంత్రి హరీశ్ రావు అందజేయ నున్నారు. సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు రైతులకు పంటనష్ట పరిహారం చెక్కులను అం దజేస్తారు. జిల్లాలో పంటనష్టపోయిన 3093 మంది రైతులకు రూ.4.04కోట్ల నష్టపరిహారం నగదును రాష్ట్ర ప్రభు త్వం మంజూరు చేసింది. మంత్రి హరీశ్‌రావు అందజేయనున్న చెక్కుల పంపిణీకి జిల్లా అధికారులు ఏర్పాటు చేపట్టారు. కలెక్టర్ శరత్ గురువారం వ్యవసాయ అధికారుల తో సమావేశం నిర్వహించిన పంటనష్ట పరిహారం పంపిణీ కార్యక్రమం నిర్వహణపై సూచనలు చేశారు.
3093 మంది రైతులకు రూ.4.04 కోట్లు పంపిణీ
సంగారెడ్డి జిల్లాలో మార్చి మాసంలో అకాల వర్షాలు కురవడంతో పంటనష్టం జరిగింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 233 గ్రామాల్లో 4047.28 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంలో 92 గ్రామాల్లో 2112 మంది రైతులకు చెం దిన 2981.14 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం డబ్బులు మొత్తం రూ.2.98 కోట్లు అందజేయనున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో సదాశివపేట, కంది మండలాల్లోని 153 మంది రైతులు 191.07 ఎకరాల్లో పంట నష్టపోయారు. వీరికి రూ.19.12 లక్షల పరిహారం అందనున్నది. అందో లు నియోజకవర్గంలోని అందోలు, రాయికోడ్, మునిపల్లి, వట్పల్లి మండలాల్లోని 52 గ్రామాల్లో 402 మంది రైతులకు చెందిన 489 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా యి. 402 మందికి రూ.48.95లక్షల పరిహారం ఇవ్వ ను న్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్, కంగ్టి, మనూరు, నాగల్గిద్ద మండలాల్లోని 64 గ్రామాలకు చెం దిన 426 మంది రైతులు 385 ఎకరాల్లో పంట నష్టపోయారు. వీరికి రూ.38.57లక్షల పరిహారం మంజూరైంది. ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల పరిహారంఇస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డిలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు రైతులకు పరిహారం చెక్కులను అందజేయనున్నారు. చెక్కుల పం పిణీకి మంత్రితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరుకానున్నారు.