కాంగ్రెస్ సర్కారు హామీలు నెరవేర్చాలి
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ సర్కారు నెరవేర్చాలని, హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూప్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం చేగుంట మండలం కర్నాల్‌పల్లి ఎల్లమ్మ దేవాలయం వద్ద ఓ శుభ కార్యానికి ఆయన హాజరయ్యారు.
- మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు
చేగుంట, మార్చి 24: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ సర్కారు నెరవేర్చాలని, హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూప్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం చేగుంట మండలం కర్నాల్‌పల్లి ఎల్లమ్మ దేవాలయం వద్ద ఓ శుభ కార్యానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ఎండిపోయిన పంటలు, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను గుర్తించి బాధిత రైతులకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం తథ్యం అన్నారు. మెదక్ స్థానంలో బీజేపీ జెండా ఎగురువేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపూర్ ఎంపీటీసీ బెదరబోయిన భాగ్యలక్ష్మీ నాగభూషణం పాల్గొన్నారు.
బీజేపీకి కార్యకర్తలే బలం.. బలగం
నిజాంపేట, మార్చి 24: బీజేపీకి కార్యకర్తలే బలం, బలగమని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం చల్మెడలోని తిరుమలనాథ స్వామి, పెద్దమ్మ ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిజాంపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రఘునందన్‌రావు మాట్లాడారు. వందరోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ. 9వేల కోట్లు అప్పు చేశాడని, రైతు రుణమాఫీపై స్పష్టత కరువైందన్నారు. బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తూ ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనా కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయ్‌కుమార్, బీజేపీ మండలాధ్యక్షులు చంద్రశేఖర్, శ్రీనివాస్, నార్లపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, నాయకులు చంద్రశేఖర్, రాజిరెడ్డి, తిరుపతి, సంజీవ్, రమేశ్, స్వామి ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

