మెదక్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిషరించేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని, ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాలులో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు దరఖాస్తులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజావాణికి మొత్తం 88 దరఖాస్తులు రాగా అందులో ఆయా శాఖలకు సంబంధించిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు కృష్ణమూర్తి, భీమయ్య, సాయిబాబా, రాధాకిషన్, శ్రీనివాస్, నాగరాజు, డాక్ట ర్ రజనీ, ఆశాకుమారి, విజయలక్ష్మి, ఇందిర, లావ ణ్య, మౌనిక, సంతోషిని, కలెక్టరేట్ ఏవో యూనుస్, బల్రామ్, సిబ్బంది ఉన్నారు.