HomeMedakThe People Who Threw The Baby Girl Into The Tree
అయ్యో పాపం
అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పిచ్చి మొక్కల మధ్య పడేశారని చిరాగ్పల్లి ఎస్సై కాశీనాథ్ తెలిపారు.
పిచ్చిమొక్కల్లో ఆడ శిశువును పడేసిన వ్యక్తులు
ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య చికిత్సలు
జహీరాబాద్, డిసెంబర్ 26: అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పిచ్చి మొక్కల మధ్య పడేశారని చిరాగ్పల్లి ఎస్సై కాశీనాథ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బుచినెల్లి గ్రామంలో ఉన్న బసవేశ్వర్ విగ్రహ సమీపంలోని పిచ్చి మొక్కల్లో గుర్తు తెలియని వ్యక్తు లు శిశువును పడేశారని సమాచారం వచ్చిందన్నారు.
గ్రామస్తుల సమాచారంతో బుచినెల్లి గ్రామానికి వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పడేశారని గ్రామస్తులు తెలిపారు. ఈ శిశువును జహీరాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. అంగన్వాడీ టీచర్ చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామన్నారు. జహీరాబాద్ ఏరియా దవాఖానలో వైద్యులు శిశువుకు మెరుగైన వైద్యం అందిస్తున్నారన్నారు.