మెదక్, సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్గ్రామాలను అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ అధికారులతో శనివారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
పల్లెల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై గ్రామసభలు పెట్టి ప్రజలకు వివరించాలని, కూడళ్లు, పంచాయతీ భవనాల ఎదుట అందుకు సంబంధించిన వివరాలు తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని చోట్లా వైకుంఠధామలను వినియోగంలోకి తెచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించి అవసరమైన పనులు చేసుకోవాలన్నారు.
– మెదక్ (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి, డిసెంబర్ 31
మెదక్/సంగారెడ్డి, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విసృ్తతంగా ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులకు సూచించారు. శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, గ్రామీణభివృద్ధి, పంచాయితీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి పారిశుధ్యం, పచ్చదనం, చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు, గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను సమకూర్చిందన్నారు.
గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాలపై గ్రామసభలు నిర్వహించి ప్రజలకు వివరించాలన్నారు. ముఖ్య కూడళ్లు, పంచాయితీ ఎదుట ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా, మండల పంచాయతీ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పింఛన్దారుల సంఖ్య, నెలనెలా అందిస్తున్న డబ్బుతో పాటు రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, పంచాయతీ భవనాల నిర్మాణాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ వంటి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు బోర్డులపై నమోదు చేయాలన్నారు.
పంచాయతీ ట్రాక్టర్లతో ఆదాయాలు పెరిగాయని, అట్టి నిధులతో పనులు చేసుకోవాలని మంత్రి సూచించారు. గ్రామాలలో నిర్మించిన వైకుంఠధామాలకు వెళ్లడానికి రోడ్లు, ప్రహరీ, నీటి సరఫరా, విద్యుత్, మరుగుదొడ్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈవో వెంకట శైలేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్, జిల్లా పంచాయితీ అధికారి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.