కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అందోల్- జోగిపేట మున్సిపల్లో వ్యాపారస్తులు, ప్రజలను కలు స్తూ ప్రచారం చేశారు.
- మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కింది
- ఫ్రీ ప్రయాణం అని బస్సులు తగ్గించారు
- జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్
- ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
- మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
- అందోల్- జోగిపేటలో ఇంటింటా ప్రచారం
అందోల్, ఏప్రిల్ 23: మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అందోల్- జోగిపేట మున్సిపల్లో వ్యాపారస్తులు, ప్రజలను కలు స్తూ ప్రచారం చేశారు. పట్టణంలోని పోచమ్మ, జోగినాథ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్థమయ్యాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణమంటూ ప్రకటన చేసి బస్సుల సంఖ్య పూర్తిగా తగ్గించారన్నారు. దీంతో మహిళలు బస్సుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 4 నెలల్లోనే పాలన అస్తవ్యస్తంగా మారిందని, సీఎం రేవంత్ ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. మళ్లీ కేసీఆర్ పాలన కావాలంటున్నారన్నారు. స్థానికంగా ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, మాజీ ఎంపీపీ రామాగౌడ్, పార్టీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, మాజీ అధ్యక్షుడు వెంకటేశం, నాయకులు నాగభూషణం, వీరభద్రరావు, మహేశ్‌యాదవ్, బీర్ల శంకర్, ఖాజాపాష, ఖలీల్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

