పటాన్చెరు, ఆగస్టు 30 : వృద్ధులకు చేతికర్ర ఆసరా పింఛన్ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో ఎంపీపీ కార్యాలయం ఆవరణలో 1364 మందికి నూతనంగా మంజూరైన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. పటాన్చెరు, అమీన్పూర్ మండలాలకు చెందిన 1364 మందికి పింఛన్లు ఇస్తూ ప్రొసీడింగ్ రాగా, పటాన్చెరు మండలానికి చెందిన 19 గ్రామాల్లోని లబ్ధిదారులు 1164 మందికి ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటున్న సర్కా ర్ టీఆర్ఎస్ అన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు అందజేస్తూ నిరుపేదల జీవితాల్లో భరోసా నింపుతున్నారన్నారు.
తెలంగాణ వస్తే ఏమి వస్తదని అడిగిన వారికి నేడు నిరుపేదలకు అందజేస్తున్న పింఛన్లు చూస్తే అర్థమవుతుందన్నారు. ప్రతినెలా రూ. 2వేల పింఛన్ అందిస్తున్న ఘనత టీఆర్ఎస్దేనన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో ఇలాం టి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. ప్రతి పక్షా లు చిల్లర రాజకీయాలు మానుకొని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని హితవు పలికారు. నిస్స హాయకులకు ఆర్థిక ధీమా ఏర్పడిందన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో భారీగా నూతన పిం ఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మశ్రీ, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, వైస్ ఎంపీపీ స్వప్నాశ్రీనివాస్, ప్రత్యేకాధికారి ప్రసాద్, తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, సర్పంచ్‌లు ఉపేందర్, కావ్య, లక్ష్మయ్య, భాగ్యలక్ష్మి, జగన్, నర్సింహు లు, ధరణి, శంకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, రాజ్‌కుమార్, ఎంపీటీసీలు నాగజ్యోతి, ఉపసర్పంచ్ వడ్డె కుమార్, శంకర్‌రెడ్డి, గోపాల్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.