ప్రతి ఒక్కరూ మతసామరస్యం పాటించాలి
అన్ని వర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి
సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి
మెదక్‌లో ఈద్ మిలాప్
మెదక్ అర్బన్, మే10: తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలో నర్సిఖేడ్‌లో పవిత్ర రంజాన్ తర్వాత జరుపుకొనే ఈద్ మిలా ప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారతదేశం లౌకిక రాజ్యం, దేశంలో ఉన్నటువంటి మతాలు హిందూవులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు అనే క రకాల మతస్తులు మత సామరస్యంతో అన్నదమ్ములుగా మెదులుతున్నారన్నారు.
ఈ మద్యనే కొన్ని అరాచక శక్తులు దేశంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నామని ప్రజలు వాటిని గమనిస్తున్నారన్నారు. 70ఏండ్ల నుంచి చిన్న చిన్న సంఘటనలు తప్ప , ప్రతి ఒక్కరూ అన్ని మతాల పండుగలను కలిసి మెల సి చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నా యకత్వంలో అన్ని వర్గాలను ఆదుకుంటూ, ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంది రాలు, గుళ్లు గోపురాలు, మసీదులు, చర్చిలు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. పూజరులకు, ముస్లింలకు, చర్చి పాదర్కు గౌరవ వేతనం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, సురేందర్‌గౌడ్, పట్టణ కౌన్సిలర్లు సమియోద్దీన్, కృష్ణగౌడ్, మదు సుధన్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.