రాయపోల్,జూలై 11: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. శుక్రవారం సిద్దిపేట జిల్లా రాయపోల్‌లో యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిలిచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రజాపాలనలో మళ్లీ పాతరోజులు వచ్చాయని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో సమయానికి యూరియా అందేదని, కాంగ్రెస్ హయాంలో కష్టాలు మొదలయ్యాయని రైతులు వాపోయారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభు త్వం సరిపడా ఎరువులను సరఫరా చేయడం లో పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపించా రు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని మండలంలోని ఆయాగ్రామాల రైతులు కోరుతున్నారు.