సిద్దిపేట కలెక్టరేట్, అక్టోబర్ 23: శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని, కేసుల్లో శిక్షల శాతం పెంచాలని రాష్ట్ర డీసీపీ జితేందర్ పోలీస్ అధికారులకు సూచించారు.బుధవారం సిద్దిపేట కమిషనరేట్‌ను ఆయన సందర్శించారు. సిద్దిపేట సీపీ అనురాధ డీజీపీకి మొక్క అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
పచ్చదనం, పరిశుభ్రతతో ఆహ్లాదకరంగా ఉందని కొనియాడారు. అనంతరం అధికారులను పరిచ యం చేసుకొ ని సర్కిళ్ల వారీగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, బైండోవర్ కేసులు, కేడీ, డీసీ, సస్పెక్ట్స్, శాంతిభద్రతలపై తెలుసుకున్నారు. 2022, 2023,2024 సంవత్సరా ల్లో నమోదైన కేసుల గురించి సీపీ అనురాధ వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ మా ట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
కేసుల్లో పారదర్శకత పాటించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. గ్రామాలు, పట్ట ణాల్లో పని చేయని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించాలన్నారు. కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రారావు, సుభాష్‌చంద్రబోస్, ఏసీపీలు, ఎస్బీ ఇన్స్పెక్టర్లు, ఏవో యాదమ్మ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.