Drawing competitions | టేక్మాల్, డిసెంబర్ 1 : జాతీయ స్థాయి చిత్ర లేఖనం పోటీల్లో టేక్మాల్ మోడల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబర్చి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ సుంకరి సాయిలు తెలిపారు. అక్టోబర్ నెలలో ముంబైకి చెందిన రంగోత్సవ్ వారు నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలో 55 మంది టేక్మాల్ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభను కనబర్చి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ పోటీల్లో కె. శిరీష ద్వితీయ బహుమతి, అనన్య ఫైవ్ స్టార్ బ్రిలియంట్ బహుమతిని అందుకున్నట్లు తెలిపారు. వీరితోపాటు 27 మంది బంగారు పతకాలు, 15 కాస్య పతకాలు, 10 రజిత పతకాలను సాధించినట్లు చెప్పారు. గ్రీటింగ్ కార్డు మేకింగ్, టాటూ మేకింగ్, హ్యాండ్ రైటింగ్, కార్టూన్ మేకింగ్, స్కెచింగ్ వంటి పలు అంశాల్లో నిర్వహించిన పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభను కనబర్చినట్లు తెలిపారు.
ఈ మేరకు ప్రిన్సిపాల్ సాయిలు, కో ఆర్డినేటర్ జలీల్, ఉపాధ్యాయులు పార్థసారధి అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పతకాలను, ప్రశంసాపత్రాలను అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు.

Padipuja | అయ్యప్ప స్వామి పడిపూజలో మాజీ ఎమ్మెల్యే
Local Election | విద్యుత్ నో డ్యూ సర్టిఫికెట్ కోసం ఎన్నికల అభ్యర్థుల తిప్పలు
Bomb Threat | కేరళ సీఎంకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు