Students | పాపన్నపేట, మార్చి 10 : ఓ ఉపాధ్యాయుడు పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో విద్యార్థుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అదే పాఠశాలలో పని చేస్తున్న భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు యాదయ్య పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు.
పాఠశాలలో 120 మంది పదో తరగతి విద్యార్థులు ఉండగా వారందరికి పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, కంపాక్స్,తదితర వస్తువులను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానుపాధ్యాయులు మహేశ్వర్, వెంకటేశం, రమేష్, మోహన్‌రావు, వేణుగోపాల్‌రెడ్డి, నర్సింహులు, రియాజ్,క్రిష్ణ కాంత్, రవికాంత్, విశ్వనాథ్, పద్మ, ఇందిర, తదితరులు పాల్గొన్నారు.
Nagarkurnool | చేతకాకపోతే గద్దె దిగండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పాడి రైతులు
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Donthi Madhav Reddy | అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి