సిద్దిపేట, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కాంగ్రెస్ పాలనలో రెండున్నరేండ్లలో మున్సిపాలిటీల్లో పారిశుధ్యం లోపించింది. మున్సిపాలిటీలకు ఒక్క అవార్డు కూడా రాలేదు. మున్సిపాలిటీల్లోని అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ మున్సిపాలిటీకి వెళ్లినా రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయి. రేవంత్‌రెడ్డికి ప్రజలు తమ ఓటుతో గుణపాఠం చెప్పితే ఈ ప్రభుత్వం కండ్లు తెరుస్తుంది. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలవుతాయి. ఓటే ఆయుధం.. ఈఓటుతో రేవంత్‌రెడ్డి దిగిపోడు ..ఎమ్మెల్యే ఏంమారడు..కానీ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుంది.ఈసర్కార్కు ఓట్లతో గుణపాఠం చెప్పాలి’ అని ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. తండ్రి వయస్సు ఉన్న కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి బూతులు తిట్టడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.రేవంత్ పాలనలో స్కీంలు బంద్ అయ్యా యి.. స్కాంలు పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను నట్టేట ముంచింది. వ్యవసాయం అస్తవ్యస్తమైంది. మల్లన్నసాగర్లో నిండా నీళ్లున్నా రైతులకు సాగు నీరు ఇవ్వడం లేదు. ఇవ్వాళ రైతులు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు.నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి… నేటి కాంగ్రె స్ ప్రభుత్వానికి రైతుల విషయంలో ఉల్టా ఫల్టా అయ్యింది. బీఆర్ఎస్ పాలనలో రైతే రాజు ఉంటే ..రేవంత్ పాలనలో రైతులకు (లగచర్లలో) బేడీలు వేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో మెజార్టీ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని హరీశ్‌రావు వివరించారు. నమస్తే తెలంగాణ ప్రతినిధికి మంగళవారం ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.. వివరాలు ఆయన మాటల్లోనే..
హరీశ్‌రావు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రోడ్లన్నీ గుంతలు ..రేవంత్ రెడ్డి కండ్లకు గంతలు. ఈకాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీల్లో ఫాగింగ్ (దోమల నివారణ కోసం)బంద్ చేసిండ్రు. మున్సిపాలిటీల్లో ఫ్రాడింగ్ పెరిగింది. ఏ మున్సిపాలిటీలు చూసినా మురుగుకాల్వలు కంపు కొడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పారిశుధ్యం లోపించింది. ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. మున్సిపాలిటీలకు ఒక్క అవార్డు కూడా రాలేదు.మున్సిపాలిటీల్లోని అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. బీఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీలను అద్దంలాగా తీర్చిదిద్దాం. మెదక్, గజ్వేల్, తూప్రాన్, దుబ్బాక, సిద్దిపేట ఇలా తదితర మున్సిపాలిటీలకు అనేక అవార్డులు వచ్చాయి. పట్టణాలకు నిధుల కేటాయింపు ముఖ్యమంత్రి నోటి మాటలు తప్పా ..ఎక్కడా కూడా చేతల్లో లేదు. ఏ మున్సిపాలిటీలో ఓ బడి కట్టింది లేదు. ఓరోడ్డు వేసింది లేదు. అసెం బ్లీ ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలుకావడం లేదు. ఇవ్వాళ మున్సిపాలిటీల్లో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది బీఆర్ఎస్ హయాంలో మాత్ర మే. కాంగ్రెస్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. వీధిదీపాలు పోతే మార్చే పరిస్థితి లేదు. ఫాగింగ్, మురుగు కాల్వలు శుభ్రం చేసే పరిస్థితి లేదు.
హరీశ్‌రావు: నిరుద్యోగ యువత, విద్యార్థులు, మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభు త్వం రాజీవ్ యువశక్తి పథకం కింద గత జూన్ 2వతేదీకే ఇస్తామని చెప్పి అప్లికేషన్లు తీసుకున్నారు. ఇంటర్వ్యూలు పెట్టారు. ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు.ఇంత వరకు అతీ గతీ లేదు.తీరా ఇవ్వాళ యువతను మోసం చేసింది కాంగ్రెస్ సర్కారు. రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అది మోసం చేసిండ్రు. రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదు. పిల్లల చదువులు ఆగమవుతున్నాయి. కేసీఆర్ రూ.19,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి రెండున్నరేండ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మహిళలను కోటీశ్వరుల్ని చేస్తామని చెప్పి కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరలు బంద్ చేశారు. మహిళలకు రూ.2500 అందడం లేదు. తులం బంగారం రావడం లేదు. వడ్డీలేని రుణంలో కూడా రేవంత్‌రెడ్డి మోసం చేశారు. కేసీఆర్ ఇచ్చిన రూ. 5లక్షలకే వడ్డీలేని రుణం వర్తిస్తుంది. కేసీఆర్ ఇచ్చిన పథకమే వడ్డీలేని రుణం. కొత్తగా ఈప్రభుత్వం ఏస్కీం తేలేదు.
హరీశ్‌రావు: ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో మెజార్టీ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది.ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలను రేవంత్‌రెడ్డి దగా చేసిండు. 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పి ఈ రోజు 28 శాతం కూడా ఇవ్వలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ, ఎస్టీలవి మినహా పలు మున్సిపాలిటీల్లో 90 శాతం బీసీలకు టికెట్లు ఇచ్చాం. కొన్ని మున్సిపాలిటీల్లో 100 శాతం కూడా బీసీలకు టికెట్లు ఇచ్చాం. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, రైతు డిక్లరేషన్ అని పెట్టిండు. ఇప్పుడేమో తిట్ల డిక్లరేషన్ అందుకున్నాడు.
హరీశ్‌రావు: కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం అస్తవ్యస్తమైంది. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు. జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీల్లో ఎక్కువ శాతం మంది రైతులు ఉన్నారు. రెండు పంటలకు రైతు భరోసా,గత యాసంగి వడ్ల బోనస్ ఇవ్వలేదు. వ్యవసాయానికి కరెంట్ 12 గంటలు కూడా రావడం లేదు. యూరియా దొరకక రైతులు చాలా ఇబ్బం ది పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ ఉంది. కేసీఆర్ పాలనలో రైతులు సంబురంగా వ్యవసాయం చేసుకున్నారు.నేడు రేవంత్ పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మల్లన్నసాగర్ నిండా నీళ్లు ఉన్నా.. రైతులకు సాగు నీరు ఇవ్వడం లేదు. మెదక్, గజ్వేల్, దుబ్బాక ప్రాంతాలకు నీళ్లు రావడం లేదు.
హరీశ్‌రావు : తండ్రి వయస్సు ఉన్న కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి బూతులు తిట్టడాన్ని ప్రజ లు అసహ్యించుకుంటున్నారు. జిల్లాలోని 16 మున్సిపాలిటీలు తిరిగాను..అనేక సభ ల్లో ప్రజలను కోరాను.. రేవంత్‌రెడ్డి భాషను మీరు సమర్థిస్తారా అంటే వారు తీవ్రంగా వ్యతిరేకించారు. వేమన శతకంలో చెప్పినట్లు బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు. (బొగ్గును పాలతో కడిగినంత మాత్రాన బొగ్గుకున్న నలుపు పోదు) ఎంత చదివినా, ఎన్ని నేర్చినా, హీనుడు తన నీచ గుణాలు మానడు. ఇవ్వాళ రేవంత్‌రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా ప్రతిష్ట తగ్గింది తప్పా పెరగలేదు. ఎన్నికల ప్రచా రంలో అన్నిచోట్ల ప్రజలకు చెప్పా. కేసీఆర్‌ను తిడితే అవ్వ కడుపు నిండదు. 4వేల పింఛన్ ఇస్తే.. నా అవ్వ కడుపు నిండుతుంది. కేసీఆర్‌ను తిట్టడం వల్ల రేవంత్‌రెడ్డికి ఏంవస్తుంది..? కేసీఆర్‌ను తిట్టడం కాదు గదా.. నీవు ఇచ్చిన హామీ 4వేల పిం ఛన్ ఇస్తే నాఅవ్వ కడుపు నిండుతుంది.
హరీశ్‌రావు : బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టిన స్కీమ్‌లు బంద్ కావడమేగాక… కొత్తగా ఈ ప్రభుత్వం పెట్టిన స్కీమ్‌లు ఏం లేవు. ఇవ్వాళ పట్టణాల్లో ఉద్యోగులు , రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటా రు. వాళ్లు ఈ ప్రభుత్వం మీద తీవ్రవ్యతిరేకంగా ఉన్నారు. డీఏలు, పీఆర్సీలు రాలేదు. రిటైర్డు ఉద్యోగులకు బెనిఫిట్స్ రాలేదు. చిన్న ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.