Tailoring | మెదక్ రూరల్, నవంబర్ 13 : మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడమే ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం ఉద్దేశం అని డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత టేలరింగ్ కార్యక్రమం మహిళా సాధికారత కేంద్రాల ద్వారా నిర్వహిస్తుందని ఆయన అన్నారు.
మెదక్ మండలం మంభోజపల్లిలో మహిళలకు ఉచితంగా ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం 9: 30 నిమిషాల నుండి సాయంత్రం 5: 30 నిమిషాల వరకు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సహకారం (స్పాన్సర్)తో మహిళా శిశు సంక్షేమ శాఖ మెదక్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత టీం ఉచిత టైలరింగ్ కార్యక్రమాన్ని గురువారం డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డీడబ్ల్యూఓ హేమ భార్గవి, మెదక్ ప్రాజెక్ట్ సీడీపీఓ వెంకటరమణమ్మ, సూపర్ వైజర్ మాధవి మహిళా సాధికారత టీంతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత టైలరింగ్ గొప్ప అవకాశంగా భావిస్తున్నాము అని అన్నారు. ప్రతి మహిళ స్వతగా ఉపాధి కలుగుతుందని మరి ఎక్కడైనా సంపాదించుకోవడానికి వీలవుతుంది అని తెలిపారు. సర్టిఫికెట్ కూడా రావడం జరుగుతుంది, ఈ సర్టిఫికెట్ తో ఉపాధి చాలా ఉంటుందని వివరించారు.
మహిళా శిశు సంక్షేమ అధికారి హేమ భార్గవి మాట్లాడుతూ.. మహిళలు అందరూ కూడా తన సొంత పిల్లలకు, తనకు ఈ కుట్టడం వల్ల ఉపాధి కలుగుతుంది ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనేది పెరుగుతుందని పేర్కొన్నారు. ఒక మహిళా స్వంతంగా డబ్బులు సంపాదించవచ్చునని దీనివల్ల విలువలు పెరుగుతాయని అన్నారు. మహిళలకు ఇది ఉపాధి కల్పిస్తున్నందుకు చాలా సంతోషమని అన్నారు.
గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక స్థితి మెరుగుపరుస్తాయి..
అనంతరం స్టేట్ బ్యాంక్ గ్రామీణ సంస్థ (సంగారెడ్డి) అధికారి నరసింహులు మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి ఈ శిక్షణ ఒక మైలురాయి అవుతుంది. స్వయం ఉపాధికి వీలుగా నైపుణ్యాలను అందించడమే మా ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయన్నారు. మంభోజిపల్లి లో 30 రోజులు ట్రైనింగ్ జరుగుతుంది. వీరికి కావలసిన భోజనం వసతి సౌకర్యం, టైలరింగ్ ట్రైనింగ్ ఈ మా ఆధ్వర్యంలో స్పాన్సర్షిప్ చేస్తున్నాం అని అన్నారు.
ప్రతిరోజు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఒక రోజు పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని.. ఈ ఉచిత టైలరింగ్ 30 రోజులు ఉంటుందని చెప్పారు. ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రామాణిక శిక్షణ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ప్రాజెక్ట్ సీడీపీఓ వెంకట రమణమ్మ, సూపర్వైజర్ మాధవి, పంచాయతీ సెక్రెటరీ, నాగేష్, ట్రైనింగ్ టీచర్, మహిళా సాధికారత టీం కోఆర్డినేటర్ సంతోషి , జెండర్ స్పెషలిస్ట్ నాగమణి, ఎస్ ఫ్ ల్ రమేష్, మాజీ సర్పంచులు అంజాగౌడ్ ,సిసి శివరంజని, వివో లీడర్స్ మాధవి, మహిళలు పాల్గొన్నారు.
Ambati Rambabu | వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదం.. వెలుగులోకి కొత్త వీడియో